Paradise: ప్యారడైజ్ లో స్పెషల్ రోల్ ఎవరు చేయనున్నారు?
ఈ ఏడాది సరిపోదా శనివారం(Saripoda Sanivaram) సినిమాతో మంచి హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శైలేష్(Sailesh Kolanu) కొలను దర్శకత్వంలో హిట్3(Hit3) చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటూ నాని, శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే దసరా(Dasara) సినిమా రావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.
నాని, శ్రీకాంత్ కలయికలో వస్తున్న ఈ సినిమాకు ప్యారడైజ్(Paradise) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అయితే దసరా సినిమాలో నానితో పాటూ దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) కూడా సమాన పాత్ర పోషించినట్టే ప్యారడైజ్ లో కూడా ఒక పాత్ర ఉంటుందని ఆ పాత్రను శ్రీకాంత్ ఎవరితో చేయించనున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ప్యారడైజ్ లో అది ఎలాంటి పాత్ర? అనేది చర్చనీయాంశంగా మారింది.
కీలక పాత్ర కాబట్టి నాని ఇమేజ్ కు సమాన ఇమేజ్ ఉన్న స్టార్ నటిస్తాడని కొందరంటుంటే ఇతర భాషల నటుడిని ఆ రోల్ కోసం తీసుకుంటే పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ పరంగా కలిసొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తుందని మరికొందరంటున్నారు. దసరాలో నానిని ఊరమాస్ గా చూపించిన శ్రీకాంత్, ప్యారడైజ్ లో నానిని ఎలా చూపించబోతున్నాడో చూడాలి.













