మరుద నాయగమ్ ఎవరు?
కమల్‌హాసన్‌కి డ్రీమ్ ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి. వాటిలో మరుద నాయగమ్ ఒకటి. 1997లో స్వీయదర్శకత్వంలో టైటిల్ రోల్ చేస్తూ ఈ సినిమాని మొదలు పెట్టారు కమల్. అయితే ఆ మధ్య లోనే ఆపేయాల్సి వచ్చింది. దానికి ఓ కారణం బడ్జెట్ అని అప్పట్లో వార్తలు వినిపించాయి. అప్పటినుంచి ఇప్పటివరకూ ఈ సినిమా గురించి ఏదో సందర్భంలో కమల్ ప్రస్తావిస్తూ వస్తున్నారు. తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. మరుదనాయగమ్ ని పూర్తి చేయాలనుకుంటున్నానని కమల్ పేర్కొన్నారు. అయితే రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నందువల్ల ఈ సినిమాలో నటించలేనని సృష్టం చేశారు. విక్రమ్ నటిస్తారని టాక్. ఇంతకీ మరుదనాయగమ్ ఎవరు? అంటే.. 18వ శతాబ్దానికి చెందిన పోరాట యోధుడు. ఆయన ఇస్లామ్ మతానికి మారక యూసఫ్ ఖాన్‌గా పేరు మార్చుకున్నారు.













