పూరీ హీరోయిన్ ఈసారి ఎక్కడనుంచి?
పూరీ సినిమాల్లో హీరోయిన్ల గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. పూరీ సినిమాల్లో దాదాపుగా కొత్త హీరోయిన్లే కనిపిస్తుంటారు. అందులోనూ పూరీ ఎక్కువగా బాలీవుడ్ నుంచి హీరోయిన్లను తీసుకొస్తుంటాడు. ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా చేస్తున్నా సరే హీరోయిన్లను మాత్రం వేరే దగ్గరనుంచి దిగుమతి చేసుకోవడం పూరీకి అలవాటు.
ఈ నేపథ్యంలో తాజాగా రామ్ హీరోగా లాంఛ్ అయిన డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం పూరీ ఏ హీరోయిన్ ను తీసుకొస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇస్మార్ట్ శంకర్ లో నిధి అగర్వాల్, నభా నటేష్ లను హీరోయిన్లుగా తీసుకున్న పూరీ, ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కోసం రామ్ కు జోడీగా ఎవరిని సెలెక్ట్ చేయనున్నాడనేది తెలియాల్సి ఉంది.
ఎప్పటిలానే పూరీ హిందీ హీరోయిన్ ను పట్టుకొస్తాడా లేక ఇప్పటికే ఫేమ్ ఉన్న టాలీవుడ్ హీరోయిన్ తో సెట్స్ పైకి వెళతాడో చూడాలి. హీరోయిన్లను అందంగా, బోల్డ్ గా చూపించడంలో దిట్ట అయిన పూరీ తన సినిమాలో హీరోయిన్ ఇచ్చే ఎలివేషన్ తోనే యూత్ ని థియేటర్లకు రప్పించగలడు. మరి ఈ సారి రామ్ కు ఎలాంటి హీరోను పూరీ జత చేస్తాడో చూడాలి.













