Venkatesh: ఏ విషయం తేల్చుకోలేకపోతున్న వెంకీ
హిట్టూ ఫ్లాపు ఎవరినైనా గందరగోళంలో పడేస్తాయి. ఫ్లాప్ పడితే తర్వాత సినిమాతో అయినా హిట్ అందుకోవాలని జాగ్రత్త పడతారు. అదే సక్సెస్ వస్తే ఆ సక్సెస్ను ఎలా కంటిన్యూ చేయాలని మరింత ఆలోచిస్తుంటారు. ఇప్పుడు వెంకటేష్(Venkatesh) పరిస్థితి కూడా అలాంటిదే. సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమాతో వెంకీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
ఈ సినిమాతో రూ.300 కోట్ల పైగా కలెక్ట్ చేసిన వెంకీ నెక్ట్స్ ఎవరితో చేయాలనే విషయంపై ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. వాస్తవానికైతే ఈ సినిమాకు ముందు వెంకీ రెండు కథలకు ఓకే చెప్పాడు. అందులో సామజవరగమన(
సెట్స్ పైకి వెళ్లడమే బ్యాలెన్స్ అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఆ రెండు సినిమాలనూ వెంకీ లైట్ తీసుకున్నాడని తెలుస్తోంది. వెంకీ ప్రెజెంట్ స్టార్ డమ్ ఉన్న డైరెక్టర్ల కోసం చూస్తున్నాడని, యాక్షన్ సినిమాలు కాకుండా ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండే సినిమాలు తీయాలని డిసైడయ్యాడని అంటున్నారు. అంతేకాదు సంక్రాంతికి సినిమాల సత్తాను స్వయంగా చూసిన వెంకీ ఇకపై ఏ సంక్రాంతినీ మిస్ కాకూడదని నిర్ణయించుకున్నాడట.













