బిగ్ బాస్ సీజన్ 4 విజేత ఎవరు?
టాప్ 5లో ఉన్న అరియానా, హారిక, అభిజిత్, అఖిల్, సొహైల్‌లలో ఎవరు విజేత కాబోతున్నారనే ఉత్కంఠకు..బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ ఈ రోజు ఆదివారం సాయత్రం 6 గంటలకు ప్రసారం మొదలైంది ఫైనల్‌కి చేరిన ఆరుగురిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా అవతరించబోతుండగా దీనికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది. టాప్ 5కి చేరుకున్న సొహైల్, అరియానా, అభిజిత్, అఖిల్, హారికలో.. అరియానా, హారికలు ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. అరియానాకి నాలుగో స్థానం లభించగా.. హారిక ఐదో స్థానంలో సరిపెట్టుకుందని సమాచారం.ఇక కాసేపటి క్రితమే టాప్ 3 కంటెస్టెంట్స్ షూట్ కంప్లీట్ కాగా.. టాప్ 3లో అభిజిత్, అఖిల్, సొహైల్‌లలో అభిజిత్ విన్నర్ అయినట్టు తెలుస్తోంది. అయితే రన్నరప్ విషయంలో చాలా నాటకీయతను జోడించినట్టు తెలుస్తోంది.
నిజానికి సొహైల్‌కి రన్నరప్ టైటిల్ రాగా.. అఖిల్ కోసం త్యాగం చేసి రూ. 25 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నట్టు తెలుస్తోంది. అఖిల్ నెం.2 కోసం కలలు కనడంతో తన కోసం మరోసారి సొహైల్ త్యాగం చేసినట్టు తెలుస్తోంది. ప్రతి సీజన్లో టాప్ 3లో ఉన్న కంటెస్టెంట్స్‌కి రూ. 25 లక్షల ఆఫర్ ప్రకటిస్తుంటారు.. ఈ రూ. 25 తీసుకుని డ్రాప్ అవుతారా? అని అడుగుతారు. గత సీజన్లలో కూడా ఇదేవిధంగా అడిగారు. అయితే ఫైనల్లో దీనికి ఎవరూ సమ్మతించకపోవడంతో రూ.25 లక్షల ప్రైజ్ మనీ ఇప్పటి వరకూ ఎవరు అందుకోలేదు. అయితే సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్లో సొహైల్ రూ.25 లక్షల ప్రైజ్ మనీ తీసుకుని వెనక్కితగ్గినట్టు తెలుస్తోంది. దీనితో అఖిల్‌కి రన్నరప్ టైటిల్ వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా అభిజిత్ విన్నర్, అఖిల్‌లు రన్నరప్ టైటిల్లు అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక సమాచారం తెలియాల్సిఉంది.
బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే ప్రారంభమైంది. మరికొద్ది సేపట్లో బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఈ లోపల అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు అందుతుంది.బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే ప్రారంభమైంది. హోస్ట్ అక్కినేని నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ‘డాన్’ సినిమాలోని ‘సూరి అన్న’ పాటతో స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్తో దుమ్ములేపారు. పువ్వుల షేర్వానీలో నాగ్ లుక్ అదిరిపోయింది. నాగార్జున ఎంట్రీ తరవాత బిగ్ బాస్ సీజన్ 4 నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు 14 మంది స్టన్నింగ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో ఎంటర్టైన్ చేశారు.ఇదిలా ఉంటే, బుల్లితెరపై 106 రోజుల పాటు వినోదాన్ని పంచిన బిగ్ బాస్ నాలుగో సీజన్ మరి కొద్ది గంటల్లో ముగియనుంది. అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన ఈ షో సెప్టెంబర్ 6న ప్రారంభమైంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్లను పరిచయం చేసిన నాగార్జున.. వాళ్లందరినీ బిగ్ బాస్ ఇంట్లోకి ఒక్కొక్కరిగా పంపారు.సినీ నటి మోనాల్ గజ్జార్, డైరెక్టర్ సూర్యకిరణ్, యాంకర్ లాస్య, హీరో అభిజీత్, ‘జోర్దార్’ యాంకర్ సుజాత, మెహబూబ్ దిల్ సే, టీవీ న్యూస్ ప్రెజెంటర్ దేవి నాగవల్లి, దేత్తడి హారిక, సయ్యద్ సోహెల్ రియాన్, యాంకర్ అరియానా గ్లోరీ, ‘అమ్మ’ రాజశేఖర్, కరాటే కళ్యాణి, సింగర్ నోయల్, నటి దివి, టీవీ నటుడు అఖిల్ సార్థక్, గంగవ్వ తొలి రోజు బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టారు.ఈ 16 మందికి మరో ముగ్గురు కంటెస్టెంట్లు జతయ్యారు. ఏడో రోజు నటుడు కుమార్ సాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టారు.
ఆ తరవాత 11వ రోజు ‘జబర్దస్త్’ ముక్కు అవినాష్, 19వ రోజు స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వెళ్లారు. దీంతో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ల సంఖ్య 20కి చేరింది. అయితే, షో నుంచి ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతున్న సమయంలో ఒక్కో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ హౌజ్‌లో అడుగుపెట్టారు.మొత్తం మీద 14వ వారం వరకు వారానికి ఒక కంటెస్టెంట్ చొప్పున బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఇద్దరు కంటెస్టెంట్లు గంగవ్వ, నోయల్ స్వతహాగా బయటికి వచ్చేశారు. చివరికి అఖిల్, అభిజీత్, సోహెల్, హారిక, అరియానా టాప్ 5 కంటెస్టెంట్లుగా, ఫైనలిస్టులుగా మిగిలారు. ఇప్పుడు ఈ ఐదుగురిలో విజేత ఎవరో తేలనుంది. ప్రస్తుతానికి అయితే అభిజీత్ విన్నర్ అని టాక్. ఎవరు విజేత ఎవరో రన్నర్ అవుతారో చూద్దాం .













