జక్కన్న కెరీర్లో ఆగిపోయిన సినిమా
దర్శకధీరుడు రాజమౌళికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాతో తన క్రేజ్ ను నేషనల్ వైడ్ గా పెంచుకున్న రాజమౌళి, ఆర్ఆర్ఆర్ తో ఆ క్రేజ్‌ను ప్రపంచవ్యాప్తంగా వ్యాపింప చేసుకున్నాడు. సీరియల్ డైరెక్టర్ గా కెరీర్‌ను మొదలుపెట్టిన రాజమౌళి గ్రాఫ్ చూస్తే అది నానాటికీ పెరుగుతూనే ఉంది.
ఇప్పటివరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించిన రాజమౌళి, తన ప్రతీ సినిమాతో మంచి సక్సెస్ అందుకుని నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టాడు. తన కెరీర్లో ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ రాజమౌళి ఫిల్మోగ్రఫీలో ఓ సినిమా మధ్యలోనే ఆగిపోయిందన్న విషయం చాలా మందికి తెలీదు. అవును.. రాజమౌళి డైరెక్షన్లో ఒక సినిమా షూటింగ్ కొంతవరకు జరుపుకుని మధ్యలోనే ఆగిపోయింది.
దాంతో ఆ సినిమా రిలీజ్‌కు నోచుకోలేదు. స్టూడెంట్ నెం.1 సినిమా తర్వాత రాఘవేంద్ర రావు కొడుకు సూర్య ప్రకాష్ తో రాజమౌళి ఓ సినిమాకు కమిట్ అయి, కొంత షూటింగ్ జరిగాక ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ కారణంతో ఆ సినిమా ఆగిపోయింది. ఇక పోతే ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు.













