పుష్ప సినిమాలో ఐటెం గర్ల్ గా చేస్తున్న లక్కీ టాప్ హీరోయిన్ ఎవరో?
‘పుష్ప’ అల వైకుంఠపురంలో లాంటి సంచలన విజయాన్ని అందుకొన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప. రంగస్థలం తర్వాత సుకుమార్ చేపట్టిన ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా సెన్సేషనల్‌గా మారింది. ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి ముందే అనేక సంచలన విషయాలకు వేదికగా మారుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలు అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతున్నాయి. అల్లు అర్జున్ బర్త్ డే రోజున విడుదల చేసిన లుక్ అద్భుతమైం స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. శేషాచలం అడవుల్లో చందనం స్మగ్లింగ్ కథా నేపథ్యంగా సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం.
ఈ సినిమాకు సంబంధించిన అల్లు అర్జున్ లుక్ విభిన్నంగా ఉండటంతో ఫ్యాన్స్ థ్రిల్ అయ్యారు. ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పుప్ఫరాజ్ అనే లారీ డ్రైవర్ క్యారెక్టర్‌ను ప్లే చేస్తున్నాడు. పాత్ర స్వభావం ప్రకారం.. ఇంతకు ముందుకంటే భిన్నంగా ముతక వేషంతోపాటు మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మాసిన గెడ్డం, చింపిరి జుట్టు అతడి ఇమేజ్‌కు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైన అల్లు అర్జున్ కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నారనే విషయం తెలుస్తోంది. ఇక పుష్పను సరికొత్తగా మార్చేందుకు సుకుమార్ ప్రయత్నిస్తున్నారని, ఈ మూవీలో రెగ్యులర్ డ్యాన్సులు అసలే కనిపించవనేది తాజా సమాచారం. ఈ సినిమా కోసం కొత్తగా, విభిన్నమైన, తెలుగు సినిమా తెరపై చూడని డ్యాన్సులను పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.సుకుమార్ తన ప్రతి సినిమాలో ఐటెం సాంగ్ ప్రత్యేకం ఫుల్ స్వింగ్ లో వున్నా హీరోయిన్ ని ఆ సాంగ్ కి ప్రజెంట్ చేస్తారు. రంగస్థలం లో పూజ హెగ్డే మరి ఈ పుష్ప సినిమాలో ఆ అవకాశం ఏ టాప్ హీరోయిన్ కి దక్కుతుందో మరి. అయితే ఎలాంటి డ్యాన్సులు చేయిస్తున్నారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే పుష్ప సినిమాలోని ఓ ఎపిసోడ్ కోసం భారీగా ఖర్చు చేయనున్నట్టు తెలుస్తున్నది. ఆరు నిమిషాల ఎపిసోడ్ కోసం 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తున్నది. అలాగే ఈ సినిమా కోసం దేవీ శ్రీ ప్రసాద్ ప్రత్యేక శ్రద్దను తీసుకొంటున్నట్టు సమాచారం. ఓవరాల్‌గా తెరపైన మళ్లీ రంగస్థలం లాంటి మ్యాజిక్‌ను చేసేందుకు సుకుమార్, అల్లు అర్జున్ కాంబో సిద్దమవుతున్నది.













