15న వస్తున్న వెంకటలక్ష్మి
గురునాధరెడ్డి సమర్పణలో ఎబిటి క్రియేషన్స్ బ్యానర్‌పై రాయ్‌లక్ష్మి ప్రధానపాత్రలో కిషోర్ కుమార్ దర్శకత్వంలో ఎం.శ్రీధర్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి, ఆర్కె రెడ్డి నిర్మిస్తున్న చిత్రం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి.. రామ్‌కార్తీక్, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మార్చి 15న సినిమా భారీ స్థాయిలో విడుదలకు ముస్తాబైంది. రాయ్‌లక్ష్మి నటించటంతో అంచనాలు బాగా పెరిగాయన్నారు. అలాగే ప్రవీణ్, మధునందన్ పాత్రలు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయని, రామ్‌కార్తీక్, పూజిత పొన్నాడ పాత్రలు సినిమాకు కీలకంగా ఉంటాయన్నారు.













