నాని, నితిన్ లు ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారో?
సలార్ సినిమా క్రిస్మస్ సీజన్ కు రిలీజ్ కానుండటంతో, ఆ సీజన్ కు కర్చీఫ్ వేసుకున్న సినిమాలు ఇప్పుడు వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. సలార్ క్రిస్మస్ కు రిలీజ్ కానుందని వార్తలు రాగానే అప్పటికే క్రిస్మస్ కు ఫిక్స్ అయిన సైంధవ్, హాయ్ నాన్న, ఎక్స్ట్రా సినిమాలు వేరే డేట్స్ కోసం సెర్చింగ్ మొదలుపెట్టాయి.
సలార్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయగానే సైంధవ్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. దానికి తగ్గట్లే ఇవాళ సైంధవ్ నుంచి కొత్త రిలీజ్ డేట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సంక్రాంతి రేసులో గుంటూరు కారం, హనుమాన్, నా సామి రంగ సినిమాలకు మరో సినిమా తోడైనట్లు అయింది.
ఇక నాని హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ డిసెంబర్ 1న రిలీజ్ అవుతున్న యానిమల్ కు మంచి టాక్ వస్తే ఈ సినిమాకు నష్టమేమో అని ఆలోచిస్తున్నప్పటికీ, తెలుగులో యానిమల్ ప్రభావం పెద్దగా ఉండదని ఆ తేదీకే మొగ్గు చూపాలని చూస్తున్నారట నిర్మాతలు. నితిన్ ఎక్స్ ట్రా సినిమా డిసెంబర్ 17న రిలీజ్ చేయాలని చూస్తున్నారట. కానీ అదే రోజు కెప్టెన్ మిల్లర్ సినిమా కూడా రిలీజ్ అవుతుండటంతో డిసెంబర్ 30కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.













