The Paradise: ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?
నేచురల్ స్టార్ నాని(Nani) కెరీర్లో మంచి జోష్ తో ఉన్నాడు. దసరా(Dasara) మూవీతో తనలోని మాస్ ను బయటపెట్టిన నాని, హిట్3(hit3) మూవీతో మాస్ లో మరింత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మాస్ లో తన ఇమేజ్ ను ఫిక్స్ చేసుకోవాలని భావించిన నాని ప్రస్తుతం ది ప్యారడైజ్(The Paradise) అనే సినిమా చేస్తున్నాడు. దసరాకు దర్శకత్వం వహించిన శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)నే ఈ సినిమాకు కూడా డైరెక్టర్.
నాని, శ్రీకాంత్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అందరికీ మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ ఆడియన్స్ కు సినిమాపై ఉన్న అంచనాల్ని ఆకాశానికందేలా చేశాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కానుందని మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. దీంతో పాటూ ఒక రోజు గ్యాప్ లో రామ్ చరణ్(Ram Charan) పెద్ది(Peddi) కూడా రిలీజ్ కానుంది.
ఓ వైపు పెద్ది సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ రిలీజై మంచి చార్ట్ బస్టర్ అయిన నేపథ్యంలో ది ప్యారడైజ్ నుంచి ఎప్పుడెప్పుడు ఫస్ట్ సాంగ్ రిలీజవుతుందా అని ఆడియన్స్ ఎదురుచూస్తూ సోషల్ మీడియాలో దీనిపై డిస్కషన్స్ చేస్తున్నారు. ఈ విషయం మేకర్స్ వరకు వెళ్లడంతో ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు వాళ్లు ప్లాన్ చేస్తున్నారని, జనవరి సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్ లో ది ప్యారడైజ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






