అనిల్ రావిపూడి నెక్ట్స్ ఏంటి?
భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి వరుసగా నాలుగో సారి కూడా హిట్ కొట్టి తన సత్తా చాటుకున్నాడు. రాజమౌళి తర్వాత వరుసగా హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ అంటూ తనని తెగ పొగిడేస్తున్నారు. భగవంత్ కేసరి సక్సెస్ అనిల్ కు కొత్త గుర్తింపును తెచ్చింది. ఇప్పటివరకు అనిల్ వినోదాత్మకమైన సినిమాలే చేశాడు.
కానీ భగవంత్ కేసరితో తాను సెంటిమెంట్ తో కూడిన కమర్షియల్ సినిమాలు కూడా చేయగలడని నిరూపించుకున్నాడు. దీంతో ఇప్పుడు అనిల్ తర్వాతి సినిమా ఏ జానర్లో చేస్తాడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో అనిల్ కూడా సరైన క్లారిటీతో లేడని సమాచారం. ఎప్పటినుంచో బాలీవుడ్లో ఎఫ్2 రీమేక్ చేయాలనుకుంటున్న అనిల్ ఇదే సరైన టైమ్ అనుకుంటున్నాడట.
మరోవైపు ఓ స్టార్ హీరోకు కూడా స్టోరీ చెప్పి అనిల్ రెడీగా ఉన్నాడని, ఆ హీరో అనిల్ కోసం వెయిట్ చేస్తున్నాడని టాక్. దీంతో పాటూ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా చేయాలనే ఆలోచనలో అనిల్ ఉన్నాడని, కానీ ఈ మూడింటిలో అనిల్ దేన్ని ముందుకు తీసుకెళ్లాలో తెలియక సతమతమవుతున్నాడని సమాచారం.













