అజయ్ భూపతి నెక్ట్స్ ఏంటి?
ఆరెక్స్ 100, మహా సముద్రం, మంగళవారం లాంటి సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్ గా నిరూపించుకున్న అజయ్ భూపతి ఓ కల్ట్ లైన్ ను తీసుకుని దాంతో ఆడియన్స్ కు ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయగలడు. గతేడాది మంగళవారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి తర్వాత ఏ సినిమా చేయనున్నాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. కొన్నాళ్ల కిందటే అజయ్ భూపతి మంగళవారం సినిమాకు సీక్వెల్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. ఈ సీక్వెల్ ను అజయ్ మరింత ఇంట్రెస్టింగ్ గా చెప్పనున్నాడని సమాచారం. ఈ సినిమాలో లీడ్ రోల్ లో ఎవరిని తీసుకుంటాడనేది ఇంకా తెలియదు. ఇదిలా ఉంటే అజయ్ భూపతి మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రెడీ అయిన ఈ సినిమా కథ నిర్మాతకు బాగా నచ్చడంతో వెంటనే లాక్ చేసినట్లు సమాచారం. ముందుగా తెలుగు హీరోలను పరిశీలించి, కుదరకపోతే బాలీవుడ్ హీరోతో చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మంగళవారం సీక్వెల్ కంటే ముందుగా ఈ సినిమానే తీయాలని చూస్తున్నాడట అజయ్. ఒకవేళ హీరోల డేట్స్ అడ్జస్ట్ కాకపోతే వీలైనంత తక్కువ టైమ్ లో మంగళవారం సినిమాను పూర్తి చేయాలని పక్కా ప్లానింగ్ తో ఉన్నాడట ఈ డైరెక్టర్. మరి ఈ రెండింటిలో అజయ్ భూపతి ఏ సినిమాను ముందు సెట్స్ పైకి తీసుకెళ్తాడో చూడాలి.













