Rashmika Mandanna: భాగస్వామి గురించి రష్మిక ఏమంటుందంటే
పుష్ప2(Pushpa2)తో సెన్సేషనల్ సక్సెస్ అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(rashmika Mandanna) బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో చేసిన చావా(Chhava) సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ చావా ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.
చావా ప్రమోషన్స్ లో రష్మిక చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపింది. తనకు ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో పాజిటివ్ గా, సంతోషంగా అనిపిస్తుందని, ఎక్కడా దొరకని ఆనందం ఇంట్లో ఉంటే లభిస్తుందని, ఇల్లే తన హ్యాపీ ప్లేస్ అని, బయట తనకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా ఇంట్లో తాను ఓ కూతురు, సోదరి, భాగస్వామినని వెల్లడించింది.
అంతే కాదు ఎదుటివ్యక్తిలో తనకు ఎలాంటి అభిరుచులుండాలో కూడా రష్మిక ఈ సందర్భంగా తెలిపింది. నవ్వుతూ ఉండే వాళ్ళంటే తనకు ఇష్టమని, ఎదుటివారిని గౌరవించే వ్యక్తులను తాను ఇష్టపడతానని రష్మిక చెప్పుకొచ్చింది. ఇవన్నీ విని రష్మిక రిలేషన్షిప్ ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే చావా సినిమాలో రష్మికకు చాలా మంచి పాత్ర దక్కిందని బాలీవుడ్ మీడియా వర్గాలు అంటున్నాయి.













