Yellamma: ఎల్లమ్మ టీమ్ సైలెన్స్ వెనుక కారణమేంటి?
బలగం(Balagam) సినిమాతో సూపర్ హిట్ సంపాదించిన వేణు యెల్దండి(Venu Yeldandi) తన రెండో సినిమాగా ఎల్లమ్మ(Yellamma)ను చేయబోతున్నాడు. బలగం సినిమాను కొత్త వారితో చేసినప్పటికీ అందరితో మంచి ఎమోషన్ పండించడంలో వేణు సక్సెస్ అయ్యాడు. ఈసారి ఎల్లమ్మ సినిమాకు వేణుకి మంచి స్టార్ కాస్ట్ ఇస్తున్నాడు దిల్ రాజు(Dil Raju).
ఎల్లమ్మ సినిమాలో హీరోగా నితిన్(Nithin) ను దిల్ రాజు ఎప్పుడో ఫిక్స్ చేశాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే నేపథ్యంలో సాయి పల్లవి(Sai Pallavi) పేరు వినిపిస్తోంది. ఎల్లమ్మ టైటిల్ రోల్ లో సాయి పల్లవి నటిస్తుందని నెట్టింట తెగ వార్తలొస్తున్నాయి. ఇంత హడావిడి అవుతున్నా ఎల్లమ్మ టీమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదంటే సాయి పల్లవి ఫిక్స్ అయినట్టే అంటున్నారు.
దిల్ రాజు టీమ్ నుంచి కానీ సాయి పల్లవి టీమ్ నుంచి కానీ ఎల్లమ్మలో సాయి పల్లవి అంటూ వచ్చిన వార్తలపై ఎవరూ స్పందించకపోవడంతో ఎల్లమ్మలో పల్లవి(Pallavi) ఫిక్స్ అయినట్టే. నిజంగా సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తే మాత్రం అది ఎల్లమ్మకు చాలా పెద్ద హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్సుంది.













