నివేదాకు ఛాన్స్ లు తగ్గడానికి కారణమదేనా..?
హీరోయిన్లలో రెండు రకాల వారుంటారు. అందాలు ఆరబోత ప్రధానంగా చేసుకుని ఛాన్సులు కొట్టేసే వారు ఒక రకమైతే, కేవలం నటనకు ప్రాధాన్యమిస్తూ ఆ తరహా పాత్రలను మాత్రమే ఎంచుకునే హీరోయిన్లు ఇంకో రకం. ఇందులో నివేదా థామస్ రెండో వర్గానికే చెందుతుంది. ఒక సౌందర్య, భూమిక, నిత్యా మీనన్, సాయి పల్లవి లాగే నివేదా కూడా క్యారెక్టర్ కు ప్రధాన పాత్రలను మాత్రమే అంగీకరిస్తూ వస్తుంది. నటనకు అనుకూలమైన కళ్లు, మంచి నవ్వు నివేదా కు ఉన్నాయి. తెరపై ఆమె క్యారెక్టర్స్ కూడా చాలా డీసెంట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది నివేదా.
ఫస్ట్ నుంచి కూడా నివేదా తమిళ, మలయాళ సినిమాలను చేస్తూ వచ్చింది. ఈ రెండు భాషల్లో కూడా ఆమెకి మంచి క్రేజ్ ఉంది. అక్కడ తన క్రేజ్ ను కాపాడుకుంటూనే టాలీవుడ్ పై కన్నీసి నాని జెంటిల్ మెన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాతో పాటూ తను చేసిన నిన్ను కోరి, జై లవకుశ, బ్రోచేవారెవరురా సినిమాలు మంచి విజయాల్ని అందుకున్నాయి. బరువైన పాత్రలను, సున్నితమైన హావభావాలను ఇట్టే పలికించగలదు అనే పేరు అతి తక్కువ కాలంలోనే నివేదా సంపాదించుకుంది.
కానీ నివేదా చేసిన వి సినిమాకు మాత్రం అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కడమే కాకుండా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు నివేదా కీలక పాత్ర పోషించిన వకీల్ సాబ్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే నివేదా కు కొంతకాలంగా ఛాన్సులు రావడం తగ్గాయని, అందుకే కొత్త ప్రాజెక్టులలో తన పేరు వినిపించట్లేదని తెలుస్తుంది. దీనికి కారణం తను నటనా ప్రాధాన్యమున్న పాత్రలు మాత్రమే చేయడం. ఇప్పుడు ట్రెండ్ ప్రకారం నటన కంటే అందాల ఆరబోతకే ఎక్కువ ఇంపార్టెన్స్. నిత్యా మీనన్ వెనుక పడటానికి రీజన్ కూడా ఇదే. నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలు వచ్చే వరకు వెయిట్ చేయడం తప్ప వీరు చేయగలిగింది మరోకటి లేదు.













