సమంత స్పీడ్ తగ్గడానికి రీజనేంటి?
కొంతమంది హీరోయిన్స్ కు పెళ్లైతే క్రేజ్ దానంతట అదే తగ్గిపోతుంది. కానీ సమంత మాత్రం దానికి అతీతం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు పదేళ్ల నుంచి స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమంతకు మాత్రం పెళ్లి తర్వాత కూడా ఆ స్టార్ డమ్ ఏ మాత్రం తగ్గలేదు. కానీ గత కొంతకాలం నుంచి మాత్రం సినిమాలు తగ్గినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు సమంత చేతిలో ఉంది కేవలం ఒకే సినిమా.
2010లో ఏ మావ చేశావే సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన సమంత, మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ కొట్టి, తర్వాత జెట్ స్పీడ్లో సినిమాలు చేసుకుంటూ చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోల పక్కన ఛాన్సులందుకుని, టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని ఇప్పటికీ అదే మెయిన్ టెయిన్ చేస్తూ వస్తుంది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైమ్ లోనే తన మొదటి హీరో, ప్రియుడు నాగ చైతన్య ను పెళ్లి చేసుకుని తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించింది. కానీ ఇప్పుడు మాత్రం సమంత జోరు తగ్గిందనిపిస్తుంది. మరి అది సమంత తీసుకున్న గ్యాప్ నా…? లేక ఆఫర్లు లేక అలా అయిందా అనేది తెలీదు.
సమంత ప్రస్తుతం గుణశేఖర్ శాకుంతలంలో నటిస్తుంది. ఇందులో దుష్యంతుడిగా మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సమంత ఏ సినిమాలో నటిస్తుందో అనే విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. పెళ్లైందని సినిమాలు తగ్గించిందా? పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్ ను సరిగా గడిపింది లేదని కాస్త గ్యాప్ తీసుకుందా? లేక దర్శకనిర్మాతలు సమంతను సంప్రదించడం మానేశారా అనేది మాత్రం తెలియట్లేదు.













