ఏజెంట్ ఓటీటీ రిలీజ్ డిలేకు రీజనేంటి?
ఈ ఇయర్ సమ్మర్ లో రిలీజైన క్రేజీ సినిమాల్లో అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ఒకటి. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద డిజాస్టర్ గా నిలిచిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రూ.80 కోట్ల బడ్జెట్ తో తీసిన ఏజెంట్‌కు థియేటర్ల లాంగ్ రన్లో కనీసం బడ్జెట్ లో 10% షేర్ కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. అయితే ఈ సినిమా రిలీజై నాలుగు నెలలు దాటి పోయింది.
అయినా ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీలోకి రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏజెంట్ థియేటర్లలో ఉండగానే ఈ సినిమా ఓటీటీ అనౌన్స్మెంట్ ను ఇచ్చేసిన సోనీ లివ్, ఇప్పటికీ ఆ సినిమాను ఎందుకు రిలీజ్ చేయడం లేదనదేని మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. వారం తిరిగే సరికే థియేటర్ల నుంచి వెళ్లిపోయిన ఏజెంట్ రిలీజ్ విషయంలో సోనీ లివ్ ఎందుకు జాప్యం చేస్తుందో తెలియట్లేదు.
ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డిలే అవడానికి రీఎడిటింగే కారణమని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని తర్వాత తెలిసింది. నెలలు గడుస్తున్నా డబ్బులు పెట్టి కొన్న సోనీ లివ్ సంస్థ ఎందుకు ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయట్లేదనేది అర్థం కావట్లేదు. రీజన్స్ ఏమైనా కావొచ్చు కానీ థియేటర్లలో ఈ సినిమాను చూడని వాళ్లకు, అసలు ఈ సినిమాకు మరీ ఇంత ఘోరమైన టాక్ ఎందుకొచ్చిందని తెలుసుకోవాలనుకుంటున్న వాళ్లకు మాత్రం ఏజెంట్ ఓటీటీ రిలీజ్ విషయంలో నిరాశ తప్పట్లేదు.






