Kannappa: కన్నప్పలో ప్రభాస్ పాత్ర నిడివి ఎంతంటే?
మంచు విష్ణు(Manchu Vishnu) నిర్మిస్తూ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప(Kannappa). ఈ సినిమాలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా, ఎంతో మంది స్టార్ క్యాస్ట్ కన్నప్పలో భాగమవుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా కన్నప్పలో కీలకపాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్(Prabhas) కన్నప్పలో ఎలా కనిపించనున్నాడనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.
రీసెంట్ గానే కన్నప్ప నుంచి అక్షయ్ కుమార్(Akshay Kumar) శివుడి పాత్రలో కనిపించాడు. మరి ప్రభాస్ ఏ పాత్రలో కనిపిస్తాడో అని డిస్కషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో ప్రభాస్ మనిషి రూపంలో తిరిగే బసవయ్యగా కనిపిస్తాడని, ఆయన పాత్ర 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఉండొచ్చని అంటున్నారు.
అంతేకాదు కన్నప్పలో ప్రభాస్ పాత్ర పరిచయం ఓ సాంగ్ తో మొదలవుతుందని, ఆ పాటకు తాను కొరియోగ్రఫీ చేస్తున్నట్టు గణేష్(Ganesh) మాస్టర్ రీసెంట్ గా ఓ రియాలిటీ షో లో వెల్లడించాడు. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఆ పాట శివ దర్శనం ముందొచ్చే ఎపిసోడ్లో ఉంటుందని సమాచారం. కన్నప్పలో ప్రభాస్ కు చాలా బలమైన సీన్స్ ఉంటాయని, ఆ విషయాలన్నింటినీ విష్ణు చాలా సీక్రెట్ గా ఉంచినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 25న కన్నప్ప ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.













