పుష్ప2 తర్వాత ఏంటి సుక్కూ?
పుష్ప సినిమాకు ముందు సుకుమార్ క్రేజ్ ఒకలా ఉంటే పుష్ప తర్వాత ఆయన స్థాయి, క్రేజ్ మరింత పెరిగాయి. పుష్ప తో సుకుమార్ టాలెంట్ ఏంటన్నది ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. పుష్ప గ్రాండ్ సక్సెస్ అవడంతో పుష్ప2 పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే పుష్ప2 తర్వాత సుకుమార్ ఎవరితో సినిమా చేయనున్నాడనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. వాస్తవానికి పుష్ప కు ముందే విజయ్ దేవరకొండ- సుకుమార్ కాంబోలో సినిమా రావాల్సింది కానీ ఈ లోగా పుష్ప లైన్ లోకి వచ్చింది. ఇక ఆ తర్వాత తెలిసిన విషయమే. ఇప్పుడు పుష్ప తర్వాత విజయ్ తో సినిమా చేస్తాడా అంటే విజయ్ వరుస కమిట్మెంట్లతో బిజీగా ఉన్నాడు.
సుకుమార్ సినిమా చేస్తానంటే కాదనడు కానీ అతనికున్న కమిట్మెంట్స్ చాలానే కాబట్టి ఆ కాంబో కష్టం. ఇక స్టార్ హీరోలలో ప్రభాస్, మహేష్ బాబు మరో నాలుగేళ్ల వరకు ఖాళీగా లేరు. బన్నీ కూడా మూడు సినిమాలను లైన్ లో పెట్టుకున్నాడు. ఎన్టీఆర్ కూడా దేవర తర్వాత వార్2, ప్రశాంత్ నీల్ మూవీతో పాటూ దేవర2 ఉంది. సో మిగిలింది రామ్ చరణే. గేమ్ ఛేంజర్ తర్వాత బుచ్చిబాబు సినిమా తప్ప ఇప్పటివరకు మరో సినిమాను ఒప్పుకోలేదు చరణ్. కాబట్టి సుక్కూ, చరణ్ కాంబోకు ఛాన్సుంది.













