Rajamouli: రాజమౌళి ప్లాన్ ఏంటో అసలు?
సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu), దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) కాంబినేషన్లో తెరకెక్కబోయే భారీ బడ్జెట్ సినిమా జనవరిలో స్టార్టవుతుందని అంటున్నారు కానీ ఫలానా డేట్ అని మాత్రం ఇంకా తెలియడం లేదు. సంక్రాంతికి మొదలవొచ్చంటున్నారు కానీ జక్కన్న మాత్రం ప్రస్తుతం లొకేషన్స్ ను వెతకడంలో బిజీగా ఉన్నాడు.
రామోజీ ఫిల్మ్ సిటీ, గండిపేట, అల్యూమినియం ఫ్యాక్టరీ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని సెట్స్ ను కూడా రెడీ చేశారు. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసుకుని టీమ్ ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా(Priyanka chopra)ని మెయిన్ లీడ్ గా తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇది ఎవరూ ఊహించని కాంబినేషన్.
పెళ్లి చేసుకున్న తర్వాత విదేశాలకు వెళ్లిపోయిన ప్రియాంక రెగ్యులర్ హీరోయిన్ గా చేయడం మానేసింది. మరి రాజమౌళి ఏరికోరి ఆమెనే తీసుకోవడం వెనుక ఏదైనా స్ట్రాటజీ ఉందేమో చూడాలి. నిజానికిది అఫీషియల్ న్యూస్ కాదు. ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. వీలైనంత వరకు అన్నీ సీక్రెట్ గా మెయిన్టెయిన్ చేసి లాస్ట్ లో అనౌన్స్ చేయడం రాజమౌళి స్టైల్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశముంది.













