లావణ్య నెక్ట్స్ ఏంటీ?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకుని లావణ్య త్రిపాఠి కొణిదెల కుటుంబానికి కోడలైన సంగతి తెలిసిందే. అయోధ్యకు చెందిన లావణ్య పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా లేదా కొణిదెల ఇంటి కోడలిగానే బాధ్యతలు నిర్వర్తిస్తుందా అన్నది తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు. లావణ్యకు మామూలుగా సినిమాలంటే ఎంతో ఇష్టం.
ఆ ఇష్టంతోనే ఇంట్లో అందర్నీ ఒప్పించి మరీ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత కూడా పేరెంట్స్ పర్మిషన్ తోనే సినిమాల్లోకి వచ్చింది. లావణ్య ఫ్యామిలీలో తన తండ్రి , అన్నయ్య ఇద్దరూ జడ్జిలుగా ఉన్నారు. లావణ్య ను కూడా మంచి చదువులు చదివించాలనుకున్నప్పటికీ సినిమాపై ఆసక్తితో లావణ్య ఇటు అడుగులేసింది.
అయితే ఇప్పుడు పెళ్లి తర్వాత లావణ్య తన కెరీర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లనుందనేది ఆసక్తికరంగా మారింది. తన పేరెంట్స్ ను ఒప్పించినట్లే అత్త మామలను కూడా ఒప్పించి ఎప్పటిలానే నటిస్తుందా లేక మెగా ఫ్యామిలీలో చిరంజీవి కూతురు, నాగబాబు కూతురు లాగా నిర్మాణంలోకి ఎంట్రీ ఇస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.













