ఫియర్ సాంగా? ఫైర్ సాంగా?
ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల మధ్య పోలికలు రావడం మామూలే అయితే ఆ పోలికలు వచ్చేది మొదటిగా సాంగ్స్ విషయంలోనే. రెండు వారాల గ్యాప్ లో రిలీజవుతున్న దేవర, కంగువ సినిమాలకు ఇప్పుడు అలాంటి పోలికే వచ్చింది. అయితే ఇక్కడో విశేషముంది. దేవరకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తుంటే, కంగువకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ రెండు సినిమాల నుంచి ఇప్పటికే ఫస్ట్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. దేవర నుంచి రిలీజైన ఫియర్ సాంగ్ ఇప్పుడు ఛార్ట్ బస్టర్ అయిపోయింది. రిలీజైన రోజు మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఫియర్ సాంగ్ మెల్లిమెల్లిగా ఆడియన్స్ లోకి వెళ్లింది. ఇప్పుడెక్కడ చూసినా ఫియర్ సాంగే. ఇదిలా ఉంటే రీసెంట్ గా సూర్య బర్త్ డే సందర్భంగా కంగువ నుంచి హీరో ఇంట్రడక్షన్ పాటగా ఫైర్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాట స్లో పాయిజన్ లాగా దేవీ శ్రీ స్టైల్ లో ఫ్యాన్స్ ను టార్గెట్ చేసి కంపోజ్ చేసినట్లనిపిస్తోంది. ఈ రెండింటి పరంగా ఏది బెస్ట్ అని పోల్చి చూస్తే మాత్రం మ్యూజిక్ లవర్స్ దేవర సాంగ్ కే ఓటేస్తున్నారు. దేవర సాంగ్ ఇప్పటికే ఛార్ట్ బస్టర్ అయింది కంగువ ఫైర్ సాంగ్ కూడా ఆ దారిలో వెళ్తుందా లేదా అనేది చూడాలి. మరో వారం ఆగితే కానీ ఏది బెస్ట్ అనేది డిసైడ్ అవదు.













