బాధగా అనిపిస్తే సమంత ఏం చేస్తుందంటే?
గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధ పడుతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ట్రీట్మెంట్ కోసం సినిమాలకు కొంతకాలం పాటూ దూరంగా ఉన్న సమంత, తన తీరిక సమయాన్ని తనదైన శైలిలో ప్లాన్ చేసుకుని గడుపుతుంది. ఇంతకుముందు అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకున్న సమంత తర్వాత ముంబై వెళ్లింది.
అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన సమంత, తన కొత్త సినిమా అప్డేట్స్ ఇస్తుందనుకుంటే తన వేరే వేరే కొత్త కొత్త అప్డేట్ లను పోస్ట్ చేస్తుంది. తాజాగా తన ఇన్‌స్టాలో అందమైన నేచర్ ఫోటోలను షేర్ చేస్తూ, తన కష్టకాలంలో ఎక్కువ ఇష్టపడే సినిమా గురించి కూడా సమంత తెలిపింది. సమంత షేర్ చేసిన ఈ పోస్ట్‌కు ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తూ సమంతను పలకరిస్తున్నారు.
తను చిన్నతనంలో బాగా సంతోషంగా అనిపించినా, బాగా బాధగా అనిపించినా సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమాను చూసేదట సమంత. ఏ ఎమోషన్ నుంచైనా ఆ సినిమా మైండ్‌ను తప్పిస్తుందని, ఆ సినిమా చూడటం వల్ల తనను తాను మర్చిపోవడమే కాకుండా మాయా ప్రపంచానికి తీసుకెళ్తుందని ప్రతి ఒక్కరూ మీ బాల్యానికి వెళ్లాలనుకుంటే ఈ సినిమాను చూడమని సమంత రాసుకురాగా, ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.













