కల్కి ప్రమోషన్స్ సంగతేంటి?
ఇండియాలోనే భారీ బడ్జెట్ తో, ఎన్నో అంచనాలతో రూపొందుతున్న సినిమా కల్కి 2898 ఏడీ. ఈ సినిమా రిలీజ్ కు ఎంతో టైమ్ లేదు. మరో 45 రోజుల్లో కల్కి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే కల్కి మీద భారీ అంచనాలున్నప్పటికీ ఆ హైప్ ను పెంచడానికి కల్కి టీమ్ ఏం చేస్తుందా అని ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇప్పటివరకు కల్కికు సంబంధించి చేసిన ప్రమోషన్స్ పూర్తి స్థాయిలో ఆడియన్స్ కు రీచ్ అవలేదు. ఏదైనా గ్రాండ్ ఈవెంట్ లేదంటే ప్రెస్ మీట్ లాగా పెట్టి ఈవెంట్ రిలీజ్ చేస్తే బాగుండేది. ఇప్పటివరకు కల్కికి సంబంధించి ఒక్క సాంగ్‌ను కూడా రిలీజ్ చేయలేదు. సాంగ్స్ ఉన్నాయో లేదో కూడా చెప్పడం లేదు. ఇంకా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోని గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే ఓ సాంగ్ రిలీజైంది.
అక్టోబర్ లో రిలీజ్ కానున్న దేవర ఫస్ట్ సింగిల్ త్వరలోనే రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ కల్కి నుంచి మాత్రం ఈ విషయంలో ఎలాంటి సౌండ్ లేదు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడనే విషయంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఆ ఇంట్రెస్ట్ ను క్యాష్ చేసుకోవాలంటే త్వరగా కల్కి మ్యూజిక్ అప్డేట్ ఇస్తే బెటర్. మరి నాగ్ అశ్విన్ కల్కి ప్రమోషన్స్ ను ఎలా ప్లాన్ చేస్తున్నాడో తనకే తెలియాలి.













