గేమ్ ఛేంజర్ ప్రాబ్లమ్ ఏంటసలు?
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్, ఈ నెల చివరి వారంలో ఓ షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకోగా, ఇప్పుడా ఆ షెడ్యూల్ వాయిదా పడినట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
గేమ్ ఛేంజర్ షూటింగ్ వాయిదా పడటం కొత్తేమీ కాదు కానీ ఇలా టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం మాత్రం కొత్తే. దీనికి కారణం ఆర్టిస్ట్‌ల కాల్షీట్స్ అందుబాటులో లేకపోవడమే. ఈ షెడ్యూల్ లో హీరోహీరోయిన్లతో పాటూ క్యాస్టింగ్ మొత్తం పాల్గొనాల్సి ఉండగా, కొందరి డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఈ షెడ్యూల్ క్యాన్సిల్ చేయక తప్పలేదట.
గేమ్ ఛేంజర్‌లో మెయిన్ విలన్ అయిన ఎస్ జె సూర్య ప్రస్తుతం ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉన్నాడు. జిగర్తండా డబుల్ ఎక్స్ కీలక భాగం ఈ నెలలోనే ఉంది. మొన్నటివరకు మార్క్ ఆంటోనీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఆ టైమ్ లో అయినా గేమ్ ఛేంజర్ షూటింగ్ ప్లాన్ చేసుకుంటే బాగుండేది. కానీ అప్పుడు సునీల్, శ్రీకాంత్, జయరాం కు ఖాళీ లేదు. ఈ సమస్య వల్లే గేమ్ ఛేంజర్ తప్పని పరిస్థితుల్లో షెడ్యూల్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా షెడ్యూల్ అక్టోబర్ రెండో వారంలో కొనసాగనుంది. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి ఫ్యాన్స్ అడిగితే ఎంత నిర్మాత అయినా ఏమని సమాధానమిస్తాడు?













