లఘు చిత్రాలకు సైమా అవార్డులు
నటుడు, పి.ఆర్.ఓ. ఏలూరు శ్రీను ఇటీవల రెండు లఘు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. మా కాలని ఫిగర్, వాట్ ఏ అమ్మాయి. ఈ రెండు చిత్రాలు సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వటమే కాకుండా వాట్ ఏ అమ్మాయికి మంచి పేరు కూడా వచ్చింది. స్టూడియో ఒన్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ల ఉత్తమ అవార్డుని మా కాలని ఫిగర్ సాధిస్తే వాట్ ఏ అమ్మాయి బాణీలు సమకూర్చిన మ్యూజిక్ డైరక్టర్ నరేష్పెంట సైమాలో నామినేట్ అయ్యాడు. వీటికి దర్శకత్వం వహించిన ఏలూరు శ్రీను మాట్లాడుతూ తొలిసారిగా దర్శకత్వం వహించిన లఘుచిత్రాలకు అవార్డు లభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. త్వరలో మెగాఫోన్ పట్టనున్న శ్రీను ఇంతకుముందు బస్టాప్, లవర్స్, రోజులు మారాయి, ఒక్క క్షణం, కొత్త జంట, చిత్రం భళారే విచిత్రం, కొబ్బరిమట్ట లాంటి చిత్రాల్లో నటుడిగా కన్పించారు.













