ఐటెం సాంగ్ పరిస్థితేంటి పుష్ప
భారతదేశం మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప2 కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పుష్ప1 భారీ హిట్ అవడంతో ఈ సినిమాను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్. అయితే రీసెంట్ గా ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ ను షూట్ చేసినట్లు వార్తలొచ్చాయి. పుష్ప1లో ఊ అంటావా మావా అనే స్పెషల్ సాంగ్ ఎలాంటి రికార్డులు సృష్టించిందో తెలిసిందే.
ఇప్పుడు పుష్ప2లో అంతకుమించిన ఐటెం సాంగ్ ను ప్లాన్ చేశారని ఎన్నో వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, ఇప్పటివరకు పుష్ప2లో ఎలాంటి ఐటెం సాంగ్ ను షూట్ చేయలేదని, మేకర్స్ ప్రస్తుతం టాకీ పార్ట్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 లో ఐటెం సాంగ్ కోసం దేవీ కొన్ని ఐడియాస్ చెప్పినప్పటికీ ట్యూన్ ఇంకా ఫైనల్ అవలేదంటున్నారు.
సుకుమార్ కూడా ముందు పుష్ప2కు సంబంధించిన టాకీ పార్ట్ ను పూర్తి చేయాలని చూస్తున్నాడట. అందుకే ప్రస్తుతానికి ఐటెం సాంగ్ ఆలోచనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో జరుగుతోంది. ఈ షూటింగ్ లో బన్నీ, రష్మిక తో పాటూ ఇతర కీలక నటీనటులు కూడా పాల్గొంటున్నారు. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అనౌన్స్ చేసిన ప్రకారం ఆగస్ట్ 15కు రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్విరామంగా షూటింగ్ జరుపుతున్నారు.













