చైతూ, సమంత.. వాటి సంగతేంటి?
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న తర్వాత కూడా కొన్ని విషయాల్లో మాత్రం వారిద్దరికీ సారూప్యతలు ఎదురవుతున్నాయి. నాగచైతన్య చేసిన మొదటి డిజిటల్ డెబ్యూ దూత వెబ్ సిరీస్ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. గతేడాది దసరా నుంచి ఈ సిరీస్ ఇదిగో వస్తుంది అదిగో వస్తుందంటున్నారు. కానీ స్ట్రీమింగ్ ఎప్పుడనేది మాత్రం చెప్పట్లేదు.
దీపావళికి కూడా వస్తుందన్న గ్యారెంటీ లేదు. అప్పట్లో అక్టోబర్ లో వస్తుందని ఊరించారు కానీ ఆ సూచనలేమీ కనిపించడం లేదు. ఇక సమంత విషయానికొస్తే, ఆమె నటించిన సిటాడెల్ ఇండియన్ రీమేక్ కూడా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుంది. హిందీతో పాటూ అన్నీ భారతీయ భాషల్లోనూ ఈ సిరీస్ రిలీజ్ కు రెడీ గా ఉంది.
ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా చేసిన ఈ సిరీస్ చాలా పెద్ద ఫ్లాపైంది. ఇక్కడ రాజ్ అండ్ డీకే లాంటి స్టార్ డైరెక్టర్లు సిటాడెల్ ను టేకప్ చేయగా, ప్రైమ్ దీన్ని నిర్మించింది. షూటింగ్ పూర్తై చాలా కాలమవుతున్నా ఈ సిరీస్ స్ట్రీమింగ్ ఇంకా కాలేదు. ఎందుకనే కారణం కూడా తెలియదు. ఏదేమైనా ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్లు ఇంత లేట్ చేయడం కరెక్ట్ కాదు. హైప్ ఉన్నప్పుడే రిలీజ్ చేస్తే కొద్దో గొప్పో వ్యూయర్షిప్ ఉంటుంది లేదంటే ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరు.













