వెల్ కం టు న్యూయార్క్ ట్రైలర్ విడుదల
బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ అందుకున్న రానా ప్రస్తుతం డిఫరెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. బహుభాషా నటుడిగా క్రేజ్ తెచ్చుకున్న రానా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యంలోని ఓ సైనికుడి ప్రేమ కథ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. ఇదే కాక పీరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రంలో కేరళ ట్రావెన్కోర్ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్ మార్తాండ్ వర్మ పాత్ర పోషించనున్నాడు రానా. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందనుంది. 1971లో హిందీలో వచ్చిన బాలీవుడ్ క్లాసిక్ చిత్రం హథీ మేరీ సాథీ రీమేక్ చిత్రం చేస్తున్నాడు. చక్రి తొలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెల్కం టు న్యూయార్క్ అనే చిత్రంలోను రానా ముఖ్య పాత్ర పోషించాడు. ఈ మూవీలో కరణ్ జోహార్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలు పోషించగా కరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడని తెలుస్తుంది.
భారతీయ తొలి త్రీడీ కామెడీగా ఈ మూవీ రూపొందుతుండగా, ఫిబ్రవరి 23న మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. న్యూయార్క్‌లో నిర్వహించే ఓ ఈవెంట్‌కు వీరంతా వెళ్తారు. అక్కడ ఏం జరిగింది అన్న విషయాలను కామెడీగా చూపించాడు. కరణ్‌ను కొందరు కిడ్నాప్ చేస్తే అతని కాపాడేందుకు రానా వెళ్తాడు. కరణ్‌ను కాపాడి మోసుకొస్తూ జై మాహిష్మతి అని అరవడం కాస్త కామెడీగా ఉంది. సుశాంత్ సింగ్, బొమన్ ఇరానీ, లారా దత్త, రితేశ్ దేశ్ముఖ అతిథి పాత్రలో నటిస్తున్నారు.













