Eesha: ‘ఈషా’తో అందరినీ కచ్చితంగా భయపెడతాం.. – వంశీ నందిపాటి
ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్‌హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓహారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా *ఈ చిత్రాన్ని డిసెంబరు 25 న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు*. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో. ఈషా మూవీ ట్రైలర్ సక్సెస్ మీట్‌ను బుధవారం నాడు నిర్వహించారు. ఈమేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో..
కెఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘ఈషా’ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. కేవలం హారర్ మాత్రమే కాకుండా థ్రిల్లర్ మూవీ. సినిమా చూసి బయటకు వచ్చిన తరువాత అందరూ కచ్చితంగా భయపడతారు. డిసెంబర్ 25 వరకు మేం సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉంటాం. ఈ మూవీ క్యాస్టింగ్ కోసం చాలా కష్టపడ్డాం. చివరకు త్రిగుణ్, హెబ్బా, సిరి, అఖిల్‌లను తీసుకున్నాం. ఈ చిత్రంతో అందరికీ విజయం దక్కాలి. అందరికీ మంచి పేరు రావాలి. ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
బన్నీ వాస్ మాట్లాడుతూ .. ‘నాకు, వంశీకి సినిమాలంటే చాలా ప్యాషన్. అందుకే ఈ ‘ఈషా’ బాధ్యతల్ని దాము గారు మాపై పెట్టారు. డిసెంబర్ 12 అన్నప్పుడు ప్రమోషన్స్‌కి టైం లేదు కదా? అని భయపడ్డాను. కానీ ఇప్పుడు మా ‘ఈషా’ని డిసెంబర్ 25న రిలీజ్ చేయబోతోన్నాం. మేం భయపెట్టడం లేట్ అవ్వొచ్చేమో కానీ.. భయపెట్టడం మాత్రం కన్ఫామ్. సినిమా చూసి రాత్రి పూట ఆంజనేయ దండకం చదువుతారు. త్రిగుణ్ అద్భుతమైన యాక్టర్. హెబ్బా చక్కగా నటించారు. ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ‘ఈషా’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
వంశీ నందిపాటి మాట్లాడుతూ .. ‘‘ఈషా’ కాస్త లేట్ అవుతోంది. భయపెట్టడం లేట్ అవ్వొచ్చు కానీ.. భయపెట్టడం మాత్రం కన్ఫామ్. మేం కచ్చితంగా ఆడియెన్స్‌ని భయపెడతాం. సినిమా చూసి భయపడని వారు నాకు కాల్ చేయండి. శ్రీనివాస్ గారు ‘ఈషా’ని అద్భుతంగా తెరకెక్కించారు. త్రిగుణ్, హెబ్బా పటేల్ చక్కగా నటించారు. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.
హీరో త్రిగుణ్ మాట్లాడుతూ .. ‘ముందుగా మా ‘ఈషా’ మూవీని తలైవా బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకున్నాం. కానీ మా మూవీని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ చిత్రంలో చివరగా ఎంటర్ అయింది నేనే. నా ‘కథ’ మూవీని డైరెక్ట్ చేసి తెలుగులోకి పరిచయం చేసిన నా దర్శకుడు, గురువు శ్రీనివాస్ గారికి థాంక్స్. అప్పుడు నేను ఇంత దూరం ప్రయాణిస్తానని, 28 సినిమాలు చేస్తానని అనుకోలేదు. నేను నా ప్రతీ సినిమాతో బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తూనే ఉంటాను. దాము గారికి ఈ కథ చెప్పిన వెంటనే నచ్చింది. బన్నీ వాస్ గారు, వంశీ గారు సినిమాను తీసుకున్నారంటే హిట్ అని, బ్రాండ్ అని చెబుతుంటారు. మా చిత్రం అందరికీ రీచ్ అవుతుందని నమ్మకం ఏర్పడింది. హెబ్బా పటేల్‌తో నేను చేస్తున్న రెండో చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. హారర్ సినిమాలు ఇష్టపడే వారందరికీ ఈ చిత్రం నచ్చుతుంది’ అని అన్నారు.
హెబ్బా పటేల్ మాట్లాడుతూ .. ‘‘ఈషా’ కథను నమ్మి ముందుకు వచ్చిన దాము గారికి, బన్నీ వాస్ సర్కి, వంశీ గారికి థాంక్స్. శ్రీనివాస్ గారు అద్భుతమైన ఫిల్మ్ మేకర్. ఆయన ‘ఈషా’తో అద్భుతం చేయబోతోన్నారు. త్రిగుణ్‌తో మళ్లీ నటిస్తుండటం ఆనందంగా ఉంది. డిసెంబర్ 25న మా మూవీ రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
దర్శకుడు శ్రీనివాస్ మన్నె మాట్లాడుతూ .. ‘‘మా టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా టెక్నీషియన్లంతా కూడా బ్రేక్ దొరకాలి, విజయం దక్కాలని కష్టపడి పని చేశారు. దాము గారు మాకు ఈ ప్రయాణంలో ఎంతో సపోర్ట్ ఇచ్చారు. బన్నీ వాస్ గారు, వంశీ గారు మా మూవీని రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా రిలీజ్ అయిన తరువాత మేం ఇంకా మాట్లాడతాం. డిసెంబర్ 25న మా చిత్రం రిలీజ్ అవుతోంది. అందరూ మా మూవీని చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
నిర్మాత హేమ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ .. ‘నాకు ఈ ఇండస్ట్రీలో గురువుగా నిలబడి సపోర్ట్ చేస్తున్న దాము గారికి థాంక్స్. మా మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్న బన్నీ వాస్ గారికి, వంశీ గారికి థాంక్స్. త్రిగుణ్, హెబ్బా అద్భుతంగా నటించారు. శ్రీనివాస్ మన్నె మంచి కథతో సినిమాను తెరకెక్కించారు. శ్రీనివాస్ సరదాగా చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. డిసెంబర్ 25న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధృవన్ మాట్లాడుతూ .. ‘నాకు ఈ ఏడాదిలో మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి పేరు వచ్చింది. ఎమోషనల్ హారర్ థ్రిల్లర్‌గా వస్తోన్న ‘ఈషా’కు పని చేయడం ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
కెమెరామెన్ సంతోష్ మాట్లాడుతూ .. ‘శ్రీనివాస్ మన్నె తన కథపై చాలా క్లారిటీతో ఉన్నారు. దాము గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా మూవీని రిలీజ్ చేస్తున్న బన్నీ వాస్ గారికి, వంశీ గారికి థాంక్స్. డిసెంబర్ 25న ఈ మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.






