మా అమ్మ బయోపిక్ కు మేం అనుమతి ఇవ్వలేదు
ఓ లెజెండ్‌పై బయోపిక్ తీయాలంటే సంబంధిత కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలి. మా అమ్మ విజయ నిర్మల బయోపిక్ తీసేందుకు మేం ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదు. మా అమ్మ బయోపిక్ కోసం నేనే కథ రాస్తున్నా అని సీనియర్ నటుడు నరేష్ అన్నారు. నటి, దర్శకురాలు విజయనిర్మల జీవితం ఆధారంగా ఓ బయోపిక్ రాబోతోందని గత కొన్ని రోజులుగా పరిశ్రమలో ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు మహానటితో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ఈ సినిమాలో విజయ నిర్మల పాత్రలో నటించబోతున్నారంటూ వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో నరేష్ స్పందించారు. బయోపిక్ కోసం స్క్రిప్ట్ రాయమని మా అమ్మే నాకు చెప్పింది. చాలా రోజుల క్రితం నుంచే నేను రాయడం మొదలు పెట్టా. అయితే గతేడాది అమ్మ ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో స్క్రిప్ట్‌కి దూరందగా ఉన్నా. మళ్లీ రాయడం మొదలు పెట్టా. అయితే గొప్ప చరిత్ర కలిగిన లెజెండ్ గురించి రాయడం అంటే మాటలు కాదు. ఎంతో పరిశోధన చేయాలి. సమచారం సేకరించాలి అని చెప్పారు. అయితే ఈ బయోపిక్‌కి నరేష్ దర్శకత్వం వహిస్తారా లేదా అనేది వేచి చూడాలి.













