War2: వార్2 నుంచి ఫ్యాన్స్ కు గూస్బంప్స్ తెప్పించే అప్డేట్
దేవర(Devara) సినిమా తర్వాత ఎన్టీఆర్(NTR) బాలీవుడ్ లో ఓ సినిమా చేసిన విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ(Ayaan Mukharjee) దర్శకత్వంలో హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా నటించిన వార్2(War2) సినిమాలో ఎన్టీఆర్(NTR) కీలక పాత్ర చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిన నేపథ్యంలో వార్2 లో ఎన్టీఆర్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
వార్2 సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాలో ఎన్టీఆర్ తన పోర్షన్ షూటింగ్ ను పూర్తి చేశాడు. ఆగస్ట్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హృతిక్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే వార్2 పై భారీ క్రేజ్ ఉండగా, ఇప్పుడు ఈ సినిమా గురించి వినిపిస్తున్న వార్తలు ఆ బజ్ ను మరింత పెంచుతున్నాయి.
వార్2 కు సంబంధించి ఎన్టీఆర్, హృతిక్ పై ఓ పవర్ఫుల్ టీజర్ ను మేకర్స్ కట్ చేసినట్టు తెలుస్తోంది. భారీ యాక్షన్ విజువల్స్ తో కూడిన ఈ టీజర్ ఆడియన్స్ కు గూస్బంప్స్ తెప్పించడం ఖాయమని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ తో ఆదిత్య చోప్రా(Aditya Chopra) నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్ గా నటిస్తోంది.






