Wamiqa Gabbi: వైట్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తోన్న వామికా
వామికా గబ్బి(Wamiqa Gabbi) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని భాషల్లో తన పవర్ఫుల్ యాక్టింగ్ తో ఆడియన్స్ ను మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వామికా ఖుఫియా(Khufiya), జూబ్లీ(Jubilee) లాంటి సినిమాలతో నటిగా తనేంటో నిరూపించుకుంది. త్వరలో బహదూర్(Bahadoor) సిరీస్ తో ప్రేక్షకుల్ని పలకరించనున్న వామికా ఓ వైపు కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అందిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే వామికా తాజాగా వైట్ కలర్ డిజైనర్ వేర్ లో ఎంతో అందంగా మెరిసింది. ఈ ఔట్ఫిట్ లో వామికా అందాలను చూసి నెటిజన్లు ముగ్ధులైపోయి, ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తున్నారు.






