వారి బాటలోనే వినాయక్ కూడా!
మంచి కమర్షియల్ సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న వివి వినాయక్, ఆది సినిమాతో కెరీర్‌ను మొదలుపెట్టి స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత ఆయన నుంచి ఫ్లాపులు కూడా వచ్చాయి. ఈ ఇయర్ హిందీలో ఛత్రపతి సినిమాను రీమేక్ చేసి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్‌ను అందుకున్నాడు.
ఛత్రపతి హిందీ రీమేక్‌తో వినాయక్ ఇమేజ్ చాలా తగ్గింది. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే వినాయక్ గురించి లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రచారం అవుతుంది. త్వరలో ఈయన ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి వెబ్ సిరీస్‌లు, సినిమాలు నిర్మించాలనుకుంటున్నారట.
ఓటీటీకి డిమాండ్ పెరగడంతో వినాయక్ దానిపై ఫోకస్ చేసినట్లు టాక్. ఇప్పటివరకు తను ఉంటున్న ఇంటిని ఆఫీస్‌గా మార్చే ప్లాన్ లో ఆయన ఉన్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ రానుందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే పలు డైరెక్టర్లు ప్రొడక్షన్ హౌస్‌లు స్టార్ట్ చేసి చిన్న సినిమాలు చేస్తుండగా, ఇప్పుడు వినాయక్ కూడా అదే బాట పట్టారు. డైరెక్టర్ గా కెరీర్ డల్‌గా ఉన్న వినాయక్ కు నిర్మాతగా ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి మరి.













