#VT15: వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ #VT15 హైదరాబాదులో శరవేగంగా జరుగుతున్న షూటింగ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ#VT15, టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో, UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా రూపొందుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాదులో శరవేగంగా జరుగుతోంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ముఖ్య తారాగణం పాల్గొంటున్న ఈ కృషియల్ షెడ్యూల్లో చాలా ఇంపార్టెంట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమా వరుణ్ కెరీర్‌లోనే వెరీ స్పెషల్, ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌గా ఉండబోతోంది. హారర్–కామెడీ, ఇండియన్ & కొరియన్ బ్యాక్డ్రాప్, యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది.
ఇప్పటికే ఇండియా, విదేశాల్లో మూడు మేజర్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసి, గ్రాండ్ విజువల్స్‌ని క్యాప్చర్ చేశారు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ‘తొలిప్రేమ’ తర్వాత వరుణ్ – థమన్ కాంబో మరోసారి అదరగొట్టే ఆల్బమ్ ఇవ్వబోతోంది.
త్వరలోనే మేకర్స్ ఎక్సైటింగ్ అప్డేట్స్ తో అలరించబోతున్నారు.







