వోగ్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ వేడుకలో మెరిసిన తారలు
ఫ్యాషన్ పత్రిక వోగ్ నిర్వహించిన వోగ్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2018 వేడుకకు బాలీవుడ్ భామలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలియా భట్, జాన్వీ కపూర్, రకుల్ ప్రీత్‌సింగ్, ఇలియానా, రాధికా ఆఫ్టే ఒకరనేమిటి హాజరైన భామలందరూ అందాల ఆరబోతకు పోటీ పడ్డారు. వీళ్లందరిదీ ఒక ఎత్తయితే కరీనా కపూర్ది మరో ఎత్తు. మిలమిలా మెరిసిపోయే ఓ స్పెషల్ డ్రస్ వేసుకొని వచ్చి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అందరూ ఆమె వంకే చూస్తుండిపోయారు. అందుకేనేమో నిర్వాహకులు కూడా స్టైల్ ఐకాన్ ఆఫ్ ఇయర్ అవార్డ్ ఆమెకే ఇచ్చేశారు. మిగిలిన హీరోయిన్లుకూడా అవార్డులు అందుకొని మురిసిపోయారు.













