వోగ్ వేడుకలో తారల మెరుపులు…
వోగ్ వుమెన్ ఆఫ్ ద ఇయర్ పురస్కార వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బాలీవుడ్లో ఏడాదికి మేటి తారలను ప్రకటించారు. ఆలియా భట్, కత్రీనా కైఫ్, తాప్సీ, జాన్వీ కపూర్, అనన్య పాండే, అమైరా దస్తూర్, అనుష్క శర్మ, రాధికా అప్టే, సోనాలీ బింద్రే, సుర్వీన్ చావ్లా తదితర నాయికలు పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో రన్వీర్ సింగ్, కరణ్ జోహార్, దుల్కర్ సల్మాన్ వేడుకలకు ప్రత్యేకత తీసుకొచ్చారు. స్టైల్ ఐకాన్ ఆఫ్ ఇయర్ గా అనుష్క శర్మ, ఫర్మారర్ ఆఫ్ ద ఇయర్‌గా ఆలియా భట్, రిస్క్ టేకర్ ఆఫ్ ద ఇయర్‌గా కత్రినా కైఫ్, ట్రైబ్లేజర్ ఆఫ్ ద ఇయర్‌గా తాప్సీ పన్ను పన్ను పురస్కారాలు దక్కించుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో సందేశాత్మక వీడియోలు పోస్టు చేసిన నవతార అనన్య పాండే యూత్ ఇన్ఫ్లూయెన్సర్ ఆఫ్ ఇ ఇయర్‌గా అవార్డు సొంతం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ద ఇయర్‌గా రన్వీర్ సింగ్, ఫిల్మ్ మేకర్ ఆఫ్ ద ఇయర్‌గా జోయా అక్తర్ పురస్కారాలు గెల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో హాలీవుడ్ తారలు లిల్లీ సింగ్, విన్నీ హార్లో పాల్గొనడం విశేషం.













