12న మోదీ బయోపిక్ విడుదల
ప్రధాని మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా పీఎం నరేంద్ర మోదీ ఏప్రిల్ 12న దేశ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్.. మోదీ పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో చిత్రీకరణ ప్రారంభించిన ఈ సినిమాకు మేరీకోమ్, సరబ్జిత్ వంటి చిత్రాలు తీసిన ఒముంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మోదీ రాజకీయ జీవిత ఆరంభమైనప్పటి నుంచి 2014లో ఆయన ప్రధాని అయ్యే వరకూ, అనేక విశేషాలు సినిమాలో ఉంటాయని దర్శకుడు చెప్పారు. కాగా, ఎన్నికల సమయంలో సినిమా విడుదల చేయడం ప్రధాని మోదీ రాజకీయ ఎత్తుగడల్లో భాగమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.













