Spirit: ప్రభాస్ తో తలపడనున్న వివేక్ ఒబెరాయ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) ప్రస్తుతం ది రాజా సాబ్(the raja Saab), ఫౌజీ(fauji) సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన ఫ్యాన్స్ తో పాటూ మూవీ లవర్స్ కూడా ఎక్కువగా ఎదురుచూస్తున్నది స్పిరిట్(spirit) మూవీ కోసం. సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga) దర్శకత్వంలో తెరకెక్కబోయే స్పిరిట్ మూవీలో ప్రభాస్ కెరీర్లోనే మొదటిసారి పోలీసాఫీసర్ గా కనిపించనున్నట్టు ఇప్పటికే డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు.
త్రిప్తి డిమ్రీ(tripti dimri) హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు సంబంధించి 70% బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పూర్తైందని రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగా వెల్లడించగా, ఎప్పుడెప్పుడు స్పిరిట్ సెట్స్ పైకి వెళ్తుందా అని అందరో ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ తో విలన్ గా ఎవరు పోటీ పడతారనేది ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలోనే స్పిరిట్ మూవీలో విలన్ గురించి ఓ అప్డేట్ వినిపిస్తోంది. స్పిరిట్ లో విలన్ గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్(Vivek Oberoi) ను సందీప్ ఎంపిక చేశాడని తెలుస్తోంది. ప్రభాస్ కటౌట్ కు వివేక్ ఒబెరాయ్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే సరిగ్గా సెట్ అవుతుందని సందీప్ భావిస్తున్నాడని, అందుకే ఆయన్ని ఎంపిక చేశాడని అంటున్నారు. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.