ఆ హీరో కోసం నాని డైరెక్టర్ ప్రయత్నాలు
సరిపోదా శనివారం సినిమాతో యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముందు నానితోనే చేసిన అంటే సుందరానికీ ఫ్లాప్ అయినప్పటికీ వివేక్ మీద నమ్మకంతో అవకాశమిచ్చాడు. నాని నమ్మకాన్ని నిలబెట్టుకుని వివేక్ ఆత్రేయ హిట్ కొట్టాడు.
అయితే ఇప్పుడు వివేక్ ఆత్రేయ తన తర్వాతి సినిమా కోసం విజయ్ దేవరకొండను ట్రై చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. సరిపోదా శనివారం సక్సెస్ ను చూపించి విజయ్ ను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడట. ఇప్పటికే విజయ్ కోసం వివేక్ ఆత్రేయ స్టోరీ లైన్ ను రెడీ చేసుకుని వినిపించాలని ట్రై చేస్తున్నాడట.
కథ నచ్చితే విజయ్ కమిట్ అయ్యే అవకాశముంది. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడంలో విజయ్ ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విజయ్ ఆ సినిమా తర్వాత మరే డైరెక్టర్కీ డేట్స్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వివేక్ ఆత్రేయ ముందుగానే కర్ఛీఫ్ వేసుకుంటే ఆయనకు అవకాశం దొరకొచ్చు.













