Suriya: మరో తెలుగు డైరెక్టర్ తో సూర్య?
ప్రస్తుతం కోలీవుడ్ హీరోలంతా టాలీవుడ్ పై కన్నేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతున్న నేపథ్యంలో అందరూ తెలుగు సినిమాలు చేయాలని, తెలుగు డైరెక్టర్లతో కలిసి పని చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు కోలీవుడ్ హీరోలు తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేయగా, ఇప్పుడు సూర్య(suriya) కూడా ఆ లిస్టులోకి చేరిన సంగతి తెలిసిందే.
సూర్య టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky atluri) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సూర్య, వెంకీ అట్లూరి సినిమాతో బిజీగా ఉండగా, ఇప్పుడు మరో తెలుగు డైరెక్టర్ తో వర్క్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ(Vivek athreya) రీసెంట్ గా సూర్య కు ఓ స్టోరీ నెరేషన్ ఇచ్చారని, సూర్య కూడా ఆ ప్రాజెక్టుపై ఆసక్తిగానే ఉన్నారని సమాచారం.
అయితే వివేక్ చెప్పిన కథకు సూర్య ఇంకా తన ఫైనల్ డెసిషన్ ను చెప్పలేదని తెలుస్తోంది. సూర్య తన డెసిషన్ ఎప్పుడు చెప్తారా అని వివేక్ వెయిట్ చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే సూర్య కంటే ముందు వివేక్ ఆత్రేయ, సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) కు కూడా ఓ కథ చెప్పారని గతంలోనే వార్తలొచ్చాయి. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు గురించి తర్వాత మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు. మరి సూర్య మరో తెలుగు డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.






