బాలీవుడ్లో 370పై కశ్మీర్ ఫైల్స్
ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ పేరు మరోమారు ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. కశ్మీర్ చరిత్రలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ది కశ్మీర్ ఫైల్స్ పేరుతో బాలీవుడ్లో ఓ చిత్రం చేయబోతున్నారు. వివక్ అగ్నిహోత్రి దర్శకుడు. తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ చారిత్రక అంశాలతో రూపుదిద్దుకోబోతున్న చిత్రమిది. ఆర్టికల్ 370ని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు రద్దు చేశారనే కారణాల్ని ఇందులో చూపిస్తాం. ఆ చరిత్రలో భాగమైన ఎంతోమంది నాయకుల పాత్రల్ని ప్రముఖ నటులు చేయబోతున్నారు. ఆ వివరాలన్ని త్వరలోనే ప్రకటిస్తాం. ది తాష్కెంట్ ఫైల్స్ తో విమర్శకుల ప్రశంసలు అందుకొన్న వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రం కోసం అల్లుకొన్న కథ అందరికీ నచ్చేలా ఉంటుంది. ఆగస్టు 14, 2020న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.













