Bollywood: జాన్ అబ్రహంపై మండిపడ్డ వివేక్ అగ్నిహోత్రి
ప్రముఖ బాలీవుడ్ డైరక్టర్ వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri) బాలీవుడ్ హీరో, నేషనల్ అవార్డు విన్నర్ అయిన జాన్ అబ్రహం(John Abraham)పై ఫైర్ అయ్యారు. ది కశ్మీర్ ఫైల్స్(the Kashmir Files), ఛావా(Chhava) సినిమాలపై రీసెంట్ గా జాన్ చేసిన కామెంట్స్ కు వివేక్ కాస్త గట్టిగానే ఆన్సరిచ్చారు. జాన్ ఏమీ చరిత్రకారుడు, మేధావి, రైటర్ కాదని వివేక్ అగ్నిహోత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తానెప్పుడూ ఫ్యాన్స్ పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసే సినిమాల్లో నటించనని, తాను ఇప్పటివరకు ఛావా, ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలను చూడలేదని, కానీ ఆ సినిమాలను ఆడియన్స్ సూపర్ హిట్ చేయడం మాత్రం తనకు తెలుసని, పొలిటికల్ గా ఉద్రిక్త వాతావరణాన్ని పెంచే సినిమాలంటే తనకు భయమని, అలాంటివి తాను చేయలేదని, ఇకపై చేయబోనని జాన్ అబ్రహం అన్నారు.
జాన్ అబ్రహం చేసిన కామెంట్స్ కు ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ అయిన వివేక్ అగ్నిహోత్రి రెస్పాండ్ అవుతూ జాన్ పై ఫైర్ అయ్యారు. జాన్ ఏమీ చరిత్రకారుడు కాదని, ఒకవేళ ఎవరైనా చరిత్రకారులు ఇలాంటి కామెంట్స్ చేస్తే తాను వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించేవాడిని కానీ జాన్ లాంటి వాళ్లు చేసే కామెంట్స్ ను తాను పట్టించుకోనని, సత్యమేవ జయతే(Satyameva Jayathe) లాంటి దేశభక్తి సినిమాలో యాక్ట్ చేసిన జాన్ ఇలా మాట్లాడటం కామెడీగా ఉందని, అయితే జాన్ అబ్రహం బైక్స్ నడపడానికి, కండలు చూపించడానికి, ప్రొటీన్ తినడానికి మాత్రమే ఫేమస్ అని, అతడు వాటిపైనే దృష్టి పెట్టాలని, సినిమాల గురించి మాట్లాడకపోతేనే బెటర్ అని సలహా ఇచ్చారు. దీంతో ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.







