Viva Reddy’s ‘O Thandri Teerpu’ : వివారెడ్డి హీరోగా ‘ఓ తండ్రి తీర్పు’
ఏవికె ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ (Arigapudi Vijay Kumar )సమర్పణలో లయన్ శ్రీరామ్ దత్తి (Loin Sriram Datthi )నిర్మాతగా, రాజేంద్ర రాజు కాంచనపల్లి (Rajendra Raju Kanchanapalli) రచన దర్శకత్వ పర్యవేక్షణలో ప్రతాప్ భీమవరపు (Pratap Bhimavarapu) దర్శకత్వంలో
వివ రెడ్డి హీరోగా ‘ఓ తండ్రి తీర్పు’(O Thandri Teerpu’ )సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది .
సహృదయులు దైవాంశ సంభూతులు డాక్టర్ కెవి రమణ చారి గారి ఆశీస్సులతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ సినిమా ద్వారా వివ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నారు.
ప్రతాప్ భీమవరుపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు రచన పర్యవేక్షణ రాజేంద్రరాజు కాంచనపల్లి.
కుటుంబ విలువలతో ఓ తండ్రి తీర్పు సినిమాను నిర్మించారు. తల్లిదండ్రుల ఆస్తులపై ఉన్న ప్రేమ తల్లిదండ్రులపై లేకపోవటం ఎంతటి మానసిక క్షోభకు గురిచేస్తుందో ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుంది.
ఓ తండ్రి తీర్పు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. ఈ చిత్రంలో కొడుకుగా వివ రెడ్డి చేస్తున్న ప్రధానమైన పాత్ర చాలామంది కొడుకులకు కనువిప్పు కలిగించేదిగా ఉంటుందని, ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని నిర్మాత శ్రీరామ్ దత్తి అన్నారు.
ఈ సినిమా డిసెంబర్ 27న థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సేవా సార్వభౌములు పుణ్య దంపతులు కీ.శే లయన్స్ శ్రీమతి ఆరిగపూడి కృష్ణ కుమారి , కీ.శే డాక్టర్ ఆరిగపూడి విజయ్ కుమార్ గార్లకు ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నారు.
ఓ తండ్రి తీర్పు సినిమాకు కీ.శే డాక్టర్ ఆరిగపూడి విజయ్ కుమార్ గారు సమర్పకులుగా ఉండడం విశేషం.













