Varun Sandesh: వరుణ్ కు మర్చిపోలేని గిఫ్టు ఇచ్చిన భార్య
టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో వరుణ్ సందేశ్(Varun sandesh), వితికా షేరు(Vithika Sheru) జంట కూడా ఒకటి. పడ్డానండీ ప్రేమలో మరి(Paddanandi Premalo Mari) సినిమాతో వీరిద్దరూ ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్తా తర్వాత స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి 2016లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.
జులై 21న వరుణ్ సందేశ్ బర్త్ డే ను జరుపుకోగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియచేశారు. ఇదిలా ఉంటే వరుణ్ కు ఈ ఇయర్ బర్త్ డే ను మరింత మెమరబుల్ చేసింది తన భార్య వితికా. దానికి కారణం వితికా, వరుణ్ కు ఇచ్చిన గిఫ్ట్. వరుణ్ కు తన భార్య ఊహించని గిఫ్టునిచ్చి అతన్ని ఆశ్చర్యపరిచింది.
వరుణ్ పుట్టినరోజుకు వితికా ఓ కొత్త ఇంటిని కొని గిఫ్టుగా ఇచ్చింది. ఈ విషయాన్ని వరుణ్ స్వయంగా వెల్లడించాడు. పుట్టినరోజుకు ఇల్లు కొనిచ్చినప్పుడే నా జన్మ ధన్యమైందని, ఈ నిజం ఇంకా ఆశ్చర్యంగానే ఉందని, ఇప్పటికీ ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నానని, నిరంతరం నన్ను సర్ప్రైజ్ చేస్తూనే ఉంటావని, నిన్ను చూస్తే గర్వంగా ఉందంటూ భార్య గురించి వరుణ్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ కు నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు.
https://www.instagram.com/p/DMaRh_lP0pv/?utm_source=ig_web_copy_link







