‘విఠలాచార్య’ మూవీ ప్రారంభం
నరేష్, నవీన్ విజయకృష్ణ, అనీష ఆంబ్రోస్, ఇంద్రజ ప్రధానపాత్రధారులుగా నటిస్తున్న చిత్రం ‘విఠలాచార్య’. సుహాస్ మీరా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నానక్ రాం గూడలోని ప్లానెట్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల తదితరులు హాజరయ్యారు. ముహూర్తపు షాట్‌కి నటుడు కృష్ణ క్లాపిచ్చారు. దర్శకుడు బి. గోపాల్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నటి, దర్శకురాలు విజయనిర్మల గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటైన విలేకర్ల సమావేశంలో కృష్ణ మాట్లాడుతూ ‘‘గొప్ప దర్శకుడు విఠలాచార్య. ఆయన దర్శకత్వం వహించిన ‘ఇద్దరు మొనగాళ్శు’ చిత్రంలో నటించాను. ఆయన పేరుని ఈ చిత్రానికి నిర్ణయించడమే విజయానికి నాంది. నేనూ ఈ చిత్రాన్ని చూసేందుకు ఎదురుచూస్తున్నా’’ అన్నారు.













