చిరూ చెల్లెళ్లతో జోడీ కట్టేదెవరు?
భోళా శంకర్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ తన తర్వాతి సినిమా విశ్వంభరను బింబిసార ఫేమ్ వశిష్ట తో చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముందే అన్నీ ప్లాన్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్లాన్ ప్రకారం షూటింగ్ చకచకా సాగుతోంఇద.
సుమారు రూ.200 కోట్ల బడ్జెట్ తో యువి క్రియేషన్స్ బ్యానర్ భారీగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవికి ఐదుగురు చెల్లెళ్లుంటారని ఇప్పటికే లీక్ అందింది. ఈ చెల్లి పాత్రల్లో సురభి, ఆషికా రంగనాథ్, ఈషా చావ్లా నటించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఈ చెల్లెళ్లకు జోడీగా నటించాల్సిన ఆర్టిస్టులను వెతికే పనిలో విశ్వంభర టీమ్ బిజీగా ఉందట. సినిమా స్థాయికి తగ్గట్టు పేరు, గుర్తింపు ఉండి ఫామ్ తగ్గిన యంగ్ హీరోలను ఈ క్యారెక్టర్ల కోసం తీసుకోవాలని చూస్తున్నారట. ఎలాగూ పెద్దగా ప్రాధాన్యత ఉండదు కాబట్టి దానికి తగ్గట్టే ఆర్టిస్టులను ఎంపిక చేయనున్నారట. మరి చిరూ సినిమాలో నటించే ఆ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.













