తండ్రి ప్లేస్ లోకి రానున్న కొడుకు?
ముందు ఊహించినట్లే క్రిస్మస్, సంక్రాంతికి రిలీజ్ కానున్న సినిమాల రిలీజ్ డేట్స్ లో అనూహ్య మార్పులు రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలంటున్నాయి. డిసెంబర్ 20న రిలీజ్ కావాల్సిన గేమ్ ఛేంజర్(Game Changer) ఇప్పుడు సడెన్ గా జనవరికి వాయిదా పడిందనే న్యూస్ మెగా ఫ్యాన్స్(Mega Fans) ను కంగారు పెడుతుంది. దానికి కారణం లేకపోలేదు.
అదే జనవరిలో చిరంజీవి(chiranjeevi) నటిస్తున్న విశ్వంభర(viswambhara) రిలీజ్ కానుంది. కాబట్టి తండ్రీ కొడుకుల మధ్య క్లాష్ జరిగే ఛాన్స్ లేదు. అలాంటప్పుడు ఈ ఛాన్స్ ఎలా అనే డౌట్ రావొచ్చు. గత రెండు మూడు వారాలుగా చికెన్ గున్యాతో ఇబ్బంది పడుతున్న చిరంజీవి పూర్తిగా రికవర్ అవడానికి మరికొంత టైమ్ పడుతుందట. అందుకే విశ్వంభర బ్యాలెన్స్ షూట్ లేటవుతుందని సమాచారం.
ఒకవేళ అదే జరిగితే విశ్వంభర ప్లేస్ ను తీసుకోవడానికి గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు(Dil raju) రెడీగా ఉన్నాడట. అదే సీజన్ లో దిల్ రాజు బ్యానర్ నుంచే వెంకటేష్(Venkatesh)- అనిల్ రావిపూడి(anil Ravipudi) సినిమా ఉన్నప్పటికీ రెండిటికీ మధ్య మూడు రోజులు గ్యాప్ ఉండేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట. అందుకే గేమ్ ఛేంజర్ పోస్టర్స్ లో రిలీజ్ డేట్ ఇవ్వడం లేదని, ఇదంతా తేలాలంటే మరికొన్ని వారాలు పట్టేలా ఉంది. డిసెంబర్ నుంచి రామ్ చరణ్ తప్పుకుంటే ఆ డేట్ లో బాలయ్య109(NBK109), తండేల్(Thandel), కన్నప్ప(Kannappa) సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది. అవి కాకపోతే రాబిన్ హుడ్(Robbin Hood), మ్యాడ్2(Mad2) అయినా రావొచ్చు. ఏదెలా ఉన్నా వీటి వల్ల డిసెంబర్ 6న వచ్చే పుష్ప2(Pushpa2) మాత్రం లాభ పడటం ఖాయం.













