Viswaksen: పెళ్లి సంబంధాలకు విశ్వక్ గ్రీన్ సిగ్నల్
ఈ ఏడాది లైలా(Laila) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విశ్వక్ సేన్(Viswak Sen) ఆ సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ను అందుకున్నాడు. ఆ సినిమా కోసం విశ్వక్ పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. దీంతో తానెలాంటి సినిమాలు చేయాలో తెలుసుకున్నానని ఇకపై ప్రతీ సీన్ ఆడియన్స్ ను మెప్పించే లానే చేస్తానని విశ్వక్ ఆడియన్స్ కు మాటిస్తూ ఓ వీడియోను చేసి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
అయితే లైలా ఫ్లాప్ తర్వాత పెద్దగా బయట కనిపించని విశ్వక్ తాజాగా హిట్3(hit3) ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు. ఈవెంట్ లో భాగంగా సుమ చేసిన ఇంటరాగేషన్ లో విశ్వక్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. రీసెంట్ గానే తన వయసుకు 30కు చేరిందని చెప్పిన విశ్వక్ ఇప్పుడిప్పుడే తను ప్రశాంతతను అలవాటు చేసుకుంటున్నానని చెప్పాడు.
మొన్నటివరకు ఊరికే అటూ ఇటూ పరిగెత్తుతుండటంతో తానెంత కూల్ గా ఉందామన్నా కుదరలేదని, ఇప్పుడు 30ల్లోకి వచ్చాక నాని(nani), అడివి శేష్(adivi sesh) ను చూసి కూల్ గా ఎలా ఉండాలో నేర్చుకుంటున్నానని విశ్వక్ తెలిపాడు. మరి మీ పెళ్లెప్పుడు అని విశ్వక్ ను సుమ అడగ్గా, మొన్ననే మా అమ్మకి పెళ్లి సంబంధాలు చూడమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని, ఎప్పుడు కుదిరితే అప్పుడు పెళ్లి చేసుకుంటానని గుడ్ న్యూస్ చెప్పాడు విశ్వక్.






