విశ్వక్ ఇక్కడితో ఆపేయడం బెటర్!
గామి సినిమాను ఓ నలుగురు పెద్ద వాళ్లు చూసి సినిమా గురించి రెండు మాటలు మంచిగా చెప్తే బాగుంటుందని రీసెంట్ గా విశ్వక్సేన్ అన్న మాటలు వైరల్ అయిన విషయం తెలిసిందే. గతంలో విశ్వక్సేన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ తనను ఎవరూ లేపనవసరం లేదని, తనకు తానే లేచి గెలిచి చూపిస్తా అన్న మాటల వీడియోను బయట పెట్టి మరి ఇప్పుడిలా ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు విశ్వక్ వరకు వెళ్లాయి.
ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానంగా విశ్వక్ సోషల్ మీడియాలోనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయి ప్రాఫిట్స్ లో ఉన్న సినిమాను స్పెషల్ గా చూడమని ఇప్పుడు నేనెందుకు అడుగుతానని విశ్వక్ అన్నాడు. గామిలో తాను తప్ప మిగిలిన టీమ్ అందరూ కొత్త వాళ్లే కాబట్టి గామిని చూసి వాళ్లను ఎంకరేజ్ చేయాలని చెప్పమని అన్నాను తప్పించి తనకు మరో ఉద్దేశం లేదని విశ్వక్ క్లారిటీ ఇచ్చాడు.
దీంతో ఇప్పుడు చాలా మంది విశ్వక్ ఈ టాపిక్ ను ఇక్కడితే వదిలేయడమే బెటరని అంటున్నారు. ప్రాక్టికల్ గా చూస్తే గామి నిజంగానే బాగా స్లో అయింది. సెకండ్ వీక్ లో బి,సి సెంటర్స్ లో షోలు బాగా తగ్గాయి. విశ్వక్ చెప్పినట్లు గామి సినిమాకు టాలీవుడ్ లో స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అందులో అనుమానం అక్కర్లేదు. అందుకని ఆ సినిమా గురించి మనం అస్తమానం చెప్పుకోనక్కర్లేనేది అసలు విషయం. కాబట్టి గామి గురించి విశ్వక్ ఈ మ్యాటర్ ను ఇక్కడితో వదిలేయడం బెటర్.













